//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దుష్టులకు దూరంగా వుండాలని....

Category : politics

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఎన్ని సీట్ల లో పోటీ చేస్తుందనే క్లారిటీ ఇవని టి.డి.పి అదే ఉత్కంఠ ని కంటిన్యూ చేస్తుంది. వై సి పి మాత్రం ముందస్తు జాగ్రత్త తీసుకుంటూ దూసుకుపోతుంది ప్లాన్ లో బాగంగా తమ ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించింది.

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తమ అభ్యర్థిని ఖరారు చేసింది వైసీపీ. నెల్లూరు జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ‌ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దింపారు జగన్. పార్టీలోని 44 మంది ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకుంటున్నా వై సి పి.. జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలోనూ ధీమాగా ఉన్నారు. చివరి నిమిషం‌లో అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందనేది వైసీపీ అనుమానం.

ఏ ఒక్కరు జారిపోకుండా క్యాంపులకు తరలించారు. ఢిల్లీ శివారులోని రిసార్ట్‌కు కొందరిని పంపారు. బ్యాచ్‌ల వారీగా ఫారిన్ టూర్లు ఏర్పాటు చేశారు. పార్టీకి పూర్తిస్థాయి నమ్మకస్తులైన ఎమ్మెల్యేలకు మాత్రం స్వేచ్ఛ‌ ఇచ్చారు. వాళ్లంతా తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ అందుబాటులో వుండాలని జగన్ ఆదేశం.

మరోవైపు.. సైకిలెక్కిన ఎమ్మెల్యేల్లో ఆరుగురిని తిరిగి పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. వారితో పాటు మరో‌ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం వేమిరెడ్డికి ఓటేస్తారని మైండ్‌గేమ్‌ మొదలుపెట్టారు.. వైసీపీ నాయకులు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత ఈ పనిలో బిజీగా ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దుష్టులకు దూరం వుండాలని సందేశమిస్తూ.. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు సత్తిబాబు అన్నారు.

ఇప్పుడెన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఎన్నికల సమయంలో అధికార పార్టీ వల విసిరితే? ఈ సందేహంతో ప్లాన్‌ బీ రెడీ చేసుకున్నారు. గత ప్రలోభాలను ఆధారాలతో బయటపెట్టాలని నిర్ణయించారు. బీజేపీ-టీడీపీ మధ్య పరిణామాలను సైతం పరిశీలిస్తున్నారు.

Related News