Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం...!

Category : national politics

అగ్ర వర్ణ పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10% శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.ఈబీసీ బిల్లుపైరాజ్య సభలో సుదీర్ఘ చర్చ అనంతరం డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించారు. ఈ ఈబీసీ ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 165 ఓట్లు వచ్చాయి.

బిల్లుకు వ్యతిరేకంగా 7 ఓట్లు వచ్చాయి. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 172 మంది సభ్యులున్నారు. బిల్లుకు దాదాపు అన్ని పార్టీలూ తమ మద్దతు తెలిపాయి. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. నేడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు.అక్కడ రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు అమల్లోకి రానుంది.

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్న సవరణతో పాటు, విపక్షాల సవరణ ప్రతిపాదనలన్నీ ఈ చట్టంతో మాసిపోనున్నాయి. అంతకు ముందు కేంద్ర సామాజిక, న్యాయశాఖమంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ... ఈబీసీలకు న్యాయం చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాని బిల్లు తెస్తున్నారని చెప్పడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన వారి యెక్క శ్రేయస్సు కొరకై ఇంతా కంటే మంచి చట్టం వేరే ఇంకేం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. సభలో రెండు, మూడు పార్టీలు తప్ప మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు బిల్లుకు మద్దతు ఇచ్చాయని ఆయన తెలిపారు. చరిత్రాత్మక బిల్లులో భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.