//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Category : national

పద్మావతి సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనను తీవ్రతరం చేసింది.

రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్లో రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఖడ్గాలతో రోడ్లెక్కారు. పట్టణంలో ఆదివారం రాజ్‌పుత్‌ల స్వాభిమాన్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. పద్మావతి సినిమా విడుదల నిర్ణయాన్ని విరమించుకోవాలని.. లేని పక్షంలో మంటల్లో దూకి ఆత్మాహుతికి పాల్పడతామని రాజ్‌పుత్ మహిళలు చిత్ర బృందాన్ని హెచ్చరించారు.

'పద్మావత్' చిత్రాన్ని విడుదల చేస్తే, తామంతా ఆత్మహత్య చేసుకుంటామని 1,908 మంది రాజస్థానీ మహిళలు అల్టిమేటం ఇచ్చారు. తామంతా 'జౌహార్' (అగ్నిగుండంలో దూకి ప్రాణార్పణ చేయడం)కు సిద్ధమని స్పష్టం చేస్తూ, తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవడం కలకలం రేపుతోంది. వెంటనే ఉన్నతాధికారులు ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి, జిల్లా కలెక్టర్‌కు మెమొరాండం పంపారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదల కాబోతున్న కొన్ని థియేటర్లపై నిరసనకారులు ఇప్పటికే దాడి చేసిన సంగతి తెలిసిందే. చిత్తోర్ గఢ్ కోట నుంచి ప్రారంభమైన మహిళల ర్యాలీ, పట్టణ వీధుల్లో సాగింది. ఆపై వీరంతా కలసి జిల్లా కలెక్టర్ ఇంద్రజిత్ సింగ్ వద్దకు వెళ్లి, ఈ మేరకు మెమొరాండం సమర్పించారు. తమ డిమాండ్ ను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకు వెళ్లాలని వారు కోరారు.

వీరనారి రాణీ పద్మినిని అవమానించేలా సినిమాను తీశారని ఆరోపించిన వారు, ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్ల వద్ద సోమవారం నుంచి మూడు రోజుల పాటు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, తాము 100 సినిమాహాల్స్ ను సంప్రదించామని, వారెవరూ ఈ సినిమాను ప్రదర్శించబోవడం లేదని లిఖిత పూర్వకంగా తెలిపారని శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన ప్రతినిధి వీరేంద్ర సింగ్ తెలిపారు.