Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వామపక్ష తీవ్రవాదంపై ఉమ్మడి పోరుకు రాజ్ నాథ్ పిలుపు

Category : national

దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సారధ్యం,  సామన్యంతో  పోరు జరపాలని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపిచ్చారు. సుకుమా జిల్లాల్లో మావోయిస్టు లు దాడి జరిపి 25 మంది కేంద్ర రిజర్వు పోలీస్ దళాలను చంపిన వారం రోజులకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నత అధికారుల సమావేశాన్ని ఢిల్లీ లో జరుపుతూ క్షేత్ర స్థాయిలో వ్యూహాత్మకముగా ఏకోన్ముఖంగా చర్యలు చేపట్టవలసి ఉన్నదని చెప్పారు.

మావోయిస్టు లపై పోరులో పాల్గొనే భద్రత దళాలకు తగు శిక్షణ, ప్రోత్సాహం అవసర మని చెబుతూ వారికి శిక్షణ సదుపాయాలు కలిపించడమా కోసం కేంద్రం సహాకారం రందిస్తుందని చెప్పారు.  మావోయిస్టు ల ఆర్ధిక వనరులను కట్టడి చేయవలసి ఉన్నాడని పేర్కొన్నారు. 

మావోయిస్టు లను కట్టడి చేయడం కోసం జరిపే అన్ని దాడులకు రాష్ట్ర యంత్రంగానే సారధ్యం వహించాలని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. కేంద్ర దళాలు వారికి కేవలం సహకారం అందిస్తాయని చెప్పారు. 

గత రెండు దశాబ్దాలుగా మావోయిస్టు ల హింసాయుత చర్యల కారణంగా 12 వేల మంది వరకు మృతి చెందారని అంటూ ఇప్పుడు ఉమ్మడిగే నూతన విస్వాసంతో వారిని కట్టడి చేయడం కోసం పనిచేయాలని పిలుపిచ్చారు. 

మానవ రహిత వాహనాలతో పాటు అత్యాధునిక కెమెరాలు, జిపిఎస్ ట్రాకింగ్ పరికరాలు, థర్మల్ ఇమేజెస్, రాడార్-ఉపగ్రహ చిత్రాలను అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రులతో విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు, కె చంద్రశేఖర రావు, మమతా బెనర్జీ హాజరు కాలేదు.

Related News