//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజ్‌నాథ్‌కు రాజస్థాన్‌లో అవమానం

Category : national

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌కు అవమానం ఎదురైంది. రాజస్థాన్‌ పర్యటనలో ఆయనకు గౌరవ వందనం దక్కలేదు. వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిన ఓ పుకారు కారణంగా కానిస్టేబుళ్లంతా ముకూమ్మడిగా విధులకు గైర్హాజర్‌ కావటంతో ఇది చోటు చేసుకుంది.

ఏం జరిగిందంటే...ఇటీవలె వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోలీస్‌ శాఖకు సంబంధించి ఓ నిర్ణయం తీసుకుంది. అయితే దాని వల్ల వారి వేతనాల్లో భారీగా కోతలు పడబోతున్నాయంటూ.. ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం 24 వేలుగా ఉన్న వారి జీతాలు 19 వేలకు పడిపోతుందని అందులో పేర్కొని ఉంది.