సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో అందరినీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ గర్వం, అహంకారం లేకుండా వినయంగా ఉంటారు. అదే విషయాన్ని ఆయనను అడిగినపుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2.0 మ్యూజిక్ ఆల్బమ్ విడుదల సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రజనీకాంత్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘‘మీరు ఇంత నిరాడంబరంగా ఎలా ఉండగలుగుతున్నారు?’’ అన్నదే ఆ ప్రశ్న.దీనికి రజనీకాంత్ చెప్పిన జవాబుతో అందరూ ఆయనను అభినందించారు. ‘‘నా నిజ జీవితంలో నటించడానికి నాకు ఎవరూ డబ్బులివ్వడం లేదు, అందుకే నిరాడంబరంగా ఉండగలుగున్నాను’’ అన్నారు. ఆయన నోటి నుంచి జాలువారిన ఈ పదాలు చెవుల్లో పడగానే ప్రెస్ మీట్లో ఉన్నవారంతా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.