//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రజనీ మీద తొలి సెటైర్

Category : national

తన పొలిటికల్ ఎంట్రీపై రజనీకాంత్ స్పష్టతనివ్వడంతో తమిళనాడులో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఇన్నాళ్లూ డోలాయామానంలో ఉన్న అభిమానులకు రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ ప్రకటించి, వారిలో ఉత్సాహం నింపారు. తలైవా ప్రకటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు మాత్రమే రజనీ ప్రకటించారని... దీనికి సంబంధించిన వివరాలను, డాక్యుమెంట్లను మాత్రం ఆయన వెల్లడించలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రజనీకాంత్ ఒక నిరక్షరాస్యుడని... మీడియా మాత్రం ఆయనను పెద్దగా చేసి చూపుతోందని ఎద్దేవా చేశారు. అలాగే తమిళ ప్రజలు చాలా తెలివైనవాళ్లని, రజనీ రాజకీయ అరంగేట్రంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.

తాను సొంతంగా పార్టీ పెట్టి తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయబోమని, 2019 ఎన్నికలకు ముందే తమ పార్టీ క్రియాశీలకంగా పని చేస్తుందని ఆయన తెలిపారు.