కావేరి బోర్డ్ కోసం తమిళనాడు గత కొంత కాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నాడిఎంకే ఎంపీలు కూడా పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేస్తూ వస్తున్నారు. అయితే రెండేళ్ళ విరామం తర్వాత ఐపీల్ కి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా దీనిపై పోరాటం చెయ్యాలని కోరుతున్నాడు తమిళ సూపర్ స్టార్ రజని కాంత్.
కావేరీ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటుచేయాలని యావత్ తమిళ చిత్ర పరిశ్రమ ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌తో పాటు..
మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా తదితరులు వళ్లువార్ కొట్టం ప్రాంతంలో నిరసనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా రజనీ మీడియాతో మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓ అభ్యర్థన చేశారు.
చెన్నైకు మద్దతు ఇవ్వాలని ఇందుకోసం ఐపీఎల్ మ్యాచుల్లో ఆడేటప్పుడు చెన్నై జట్టు సభ్యులంతా నలుపు రంగు బ్యాండ్లు కట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటుకు తమిళనాడు ఎంత పోరాటం చేస్తోందో అందరికీ తెలుస్తుందని అన్నారు.