//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజస్థాన్ విజయ లక్ష్యం 152 .... రాణించిన విలియమ్సన్

Category : sports

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ అనుకున్నంత ఫాస్ట్ గా సాగలేకపోయింది. మొదట 17 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (6) రూపంలో తొలి వికెట్ ను కోల్పోయింది హైదరాబాద్. ఆ తర్వాత 109 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్‌తో కలిసి కెప్టెన్ విలియమ్సన్ 63(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

ఈ క్రమంలో 13.3 ఓవర్ వద్ద 45 పరుగులు చేసిన హేల్స్, గౌతమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరో 7 పరుగులు జోడించాక జోరు మీదున్న విలియమ్సన్‌ కూడా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన షకీబల్ హసన్ (6), యూసుఫ్ పఠాన్ ఉసూరు మనిపించాడు.

రెండు పరుగులు మాత్రమే చేసిన పఠాన్ జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. చివర్లో వికెట్ లను వెను వెంటనే కోల్పోవటం తో ఒక మాదిరి స్కోర్ కె హైదరాబాద్ సరిపెట్టుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి సన్ రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ విజయ లక్ష్యం 152 .

Related News