//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సూపర్ కింగ్స్ పై రాయల్స్ విక్టరీ...!

Category : sports

రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 4వికెట్ల తేడాతో రాయల్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించింది. మొదట టస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. వాట్సన్‌,అంబటి రాయుడు ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చారు.

అయితే 2.1ఓవర్లో స్కోరు 19పరు గుల వద్దఉండగా రాయుడు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. వాట్సన్‌ కు సరేష్‌ రైనా జతకలిసాడు. ఇద్దరూ కలిసి ముందుకు తీసుకుపోయారు. వీరిద్దరి జోరు తో 11.3ఓవర్లోనే సూపర్‌ కింగ్స్‌ స్కోరు 105పరుగులకు చేరింది. జోఫ్రాఆర్చర్‌ బౌలింగ్‌లో జోస్‌ బట్లెర్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మంచి ఊపుమీద ఆడుతున్న రైనాకు మిస్టర్‌కూల్‌ ధోని జతకలిసాడు. ఇద్దరి మధ్య భారీ భాగస్వామ్యం కుదుర్తుందన్న అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి.

12.6 ఓవర్లో 119 పరుగుల వద్ద సురేష్‌ రైనా 52(35) బిన్నీకి క్యాచ్‌ ఇచ్చి అవుట్ అయ్యాడు. క్రీజులో ఉన్న ధానాధన్‌ ధోనీకి బిల్లింగ్స్‌ జత కలిసాడు. ఇద్దరూ కలిసి స్కోర్‌ను పరుగులు పెట్టించారు. భారీషాట్లకు పోకుండా త్వరగా పరుగులు వచ్చేలా వికెట్ల మధ్య పటిష్టంగా పరుగులు తీసారు. 174 పరుగుల వద్ద బిల్లింగ్స్‌ 27(22) అవ్ఞటయ్యాడు. 20ఓవర్ల సూపర్‌ కిం గ్స్‌ బ్యాటింగ్‌ ముగిసే సమయానికి 4వికెట్ల నష్టా నికి 176 పరుగులు చేసింది.

177 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన రాయల్స్‌ ప్రారంభం నుండే వేగంగా ఆడింది. జోస్‌ బట్లెర్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేసాడు. బెన్‌Zసోక్స్‌1సిక్సు 1ఫోర్‌ కొట్టి మురిపించాడు. కానీ వెంటనే 3.6 ఓవర్లో హరిభజన్‌ విసిరిన బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అ య్యాడు. తర్వాత వెంటనే కెట్టెన్‌ పేలవంగా అవ్ఞ టయ్యాడు. వెంట వెంటనే రెండు వికెట్లు కూలడంతో రాయల్స్‌కు భారీ భాగ స్వామ్య అవసరం ఏర్పడింది.

ఒకవైపు జోస్‌ 95(60) బ్లాస్టింగ్‌ బ్యాటింగ్‌ చేయటంతో స్కోరు వేగంగా పెరిగించి. బట్లెర్‌కు శాంసన్‌21(22), బిన్నీలు సహకరించారు. చివరి మూడు ఓవర్లు ప్రేక్షకులను అలరించాయి. మూడు బంతులలో 8పరు గుల చేయాల్సిన ఉత్కంఠ పరిస్థితుల లో రాయల్స్‌ అద్భుతంగా ఒత్తిడిని జయించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. చివరి ఓ వర్లో బట్ల్లర్‌ ఒక భారీ సిక్స్‌ కొట్టి రాజస్థాన్‌ రాయ ల్స్‌కు ఉత్కంఠ విజయాన్ని అందించాడు.దీంతో రాజస్థాన్‌రాయల్స్‌ 4వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మిస్టర్‌ కూల్‌గా పేరున్న కెప్టెన్‌ ధోని... రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ చివర్లో ఆగ్రహానికి గురయ్యాడు. 19వ ఓవర్లో విల్లీ 2 సిక్స్‌లు ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశాడు. 20వ ఓవర్లో బట్లర్‌ షాట్‌ కొట్టగా బంతి చాలాసేపు గాల్లో నిలిచింది. అయినా ఫీల్డర్లెవరూ అందుకోవడానికి రాకపోవడంతో ధోని ‘ఏంటిది?’ అన్నట్లు చూశాడు.