//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లవ్ జీహాద్ అంటూ గొడ్డలితో నరికి సజీవదహనం...!

Category : national

ఒక మనిషి ఇంకో మనిషి ని అతి కిరాతకంగా వీడియో తీస్తూ హత్యా చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే..

లవ్ జిహాద్‌కి పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. ఓ ముస్లిం యువకుడిని దారుణంగా హత్యచేసి సజీవదహనం చేసిన వైనమిది. నిందితుడు తాను చేస్తున్న అకృత్యాన్ని లైవ్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లాలో చోటుచేసుకుందీ దారుణం.

సదరు భయానక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాజస్థాన్ ప్రభుత్వం ఇవాళ ఆగమేఘాల మీద సిట్ ఏర్పాటు చేసింది. హత్యతో పాటు, దీని వెనుక మతపరమైన కోణం ఏదైనా ఉందా అనేదాన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

రాజస్థాన్ హోమంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ..హత్య చేసి వీడియో తీసిన తీరు షాక్‌కు గురిచేసింది. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కూడా ఏర్పాటు చేశాం...’’ అని వెల్లడించారు. కాగా హత్యకు గురైన బాధితుడిని మహ్మద్ అఫ్రజుల్‌గా గుర్తించారు. ఇతడు పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా నుంచి రాజస్థాన్‌కు వలసవచ్చినట్టు భావిస్తున్నారు.

రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఇతడిని నిందితుడు హత్యచేస్తూ వీడియో తీశాడు. గొడ్డలితో దాడి చేయడం... సహాయం కోసం బాధితుడు ఏడుస్తూ వేడుకోవడం వీడియోలో రికార్డు అయ్యింది. అనంతరం బాధితుడిని సదరు ఉన్మాది సజీవ దహనం చేశాడు. వీడియో తీసేందుకు నిందితుడు మరో వ్యక్తిని కూడా తనతోపాటు తీసుకెళ్లినట్టు భావిస్తున్నారు.