//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్రివిక్రమ్ నీకెంత డేర్ ...అరవిందసమేత ఫై రాజమౌళి కామెంట్స్ ....

Category : movies

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా , మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో వచ్చిన అర‌వింద సమేత‌ చిత్రం దసరా కానుకగా ఈ నెల 11 న విడుదల అయ్యింది . ఈ సినిమా మొదటిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ థియేటర్స్‌లో అడుగుపెట్టిన ఈ చిత్రం.. నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ భారీ కల్లెక్షన్స్ దిశగా పరుగులు పెడుతోంది.

ఈ కలయిక లో సినిమా అని అనగానే అప్పటినుండే ఈ సినిమా ఫై భారీ అంచనాలు ఉన్నాయి . దానికి తగ్గట్టే టీజర్ ట్రైలర్ కూడా ఉండడం తో సినిమా పై హైప్ ఊహించని స్థాయి లో పెరిగిపోయింది . ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా కూడా పూర్తీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . కలెక్షన్స్ విషయంలో కూడా టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ని సృష్టిస్తూ పరుగులుపెడుతుంది .

తాజాగా ఈ చిత్రం చూసిన దర్శకధీరుడు రాజమౌళి.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రతిభను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. మీరు ఇద్దరు ఎంచుకున్న కథే , మిమల్ని విజయంవైపు నడిపించింది అని చెప్పుకొచ్చాడు రాజమౌళి . ముఖ్యంగా అందరూ కూడా యుద్ధం ఎలా జరిగింది , యుద్ధాలలో ముఖ్యమైన విషయాలని చూపిస్తారు కానీ యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది, అనే పాయింట్‌ని బేస్ చేసుకొని సినిమాను ప్రారంభించడమే త్రివిక్రమ్ డేరింగ్ స్టెప్ అంటూ త్రివిక్రమ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు . ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడుఅని చెప్పాడు . ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ చూపిన అభినయం సినీ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండి పోతుంది. జగపతిబాబు నటన మరింత అద్భుతంగా ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు జక్కన్న.