//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓపెనింగ్ రోజే అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వనున్న రాజమౌళి ...!

Category : movies

దర్శక ధీరుడు SS Rajamouli బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా అని కళ్ళు కాయలు కాచేలా దేశవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నా సినీ ప్రేక్షకుడికి RRR రూపంలో తిరుగులేని ఆన్సర్ ఇచ్చాడు రాజమౌళి . బాహుబలి ది కంక్లూజన్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ఆర్ ఆర్ ఆర్ తో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. వాస్తవంగా బాహుబలి ది కంక్లూజన్ తర్వాత ఆ క్రేజీ ప్రాజెక్ట్ ను మించిన ప్రాజెక్ట్ ఎలా సెట్ చేస్తారా అన్నది ఊహించడం కష్టమే.Rajamouli gives big twist on opening day

రాజమౌళి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ Tollywood లోనే బలమైన వారసత్వం ఉన్న నందమూరి మెగా కుటుంబానికి చెందిన యువ హీరోలు అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. వాస్తవంగా చూస్తే NTR రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ చేయడంతోనే రాజమౌళి సగం విజయం సాధించారు. అంత ఒకే అయిపోయింది ఇక ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తారో అని అటు మెగా, ఇటు నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11 వ తారీకున ఉదయం 11 గంటలకు క్లాప్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు.Rajamouli gives big twist on opening day

ఇక్కడ వరకు ఓకే అంత బాగుంది అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ముఖ్య అతిధులుగా ఎవరు వస్తారనేది అసలు ట్విస్ట్ ఇప్పడికే బాలయ్య, NTR కలిసిపోయారు. ఇక బాలయ్య కూడా ముఖ్య అతిధిగా వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే చెర్రీ తరుపున చిరు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే బాహుబలి హీరో ప్రభాస్ వస్తున్నాడని సమాచారం, ఇక ముఖ్య అతిథులుగా వచ్చే విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత డివివి దానయ్య రెండు వందల కోట్ల పైచిలుకు భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.Rajamouli gives big twist on opening day