//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కెరీర్ మొత్తంలో 12 చిత్రాలు.. వ‌రుస‌గా చివ‌ర‌ది 5-సినిమాలు ప్లాప్.. రాజ్ తరుణ్ ఫ్యూచ‌ర్ ఏంటి..?

Category : movies

టాలీవుడ్‌లో అనూహ్యంగా దూసుకువ‌చ్చిన కుర్ర హీరో రాజ్ త‌రుణ్. స్టార్టింగ్‌లో వ‌రుస హిట్ల‌తో త‌క్కువ టైమ్‌లోనే షాకింగ్ రెమ్మున‌రేష‌న్ తీసుకున్న రాజ్ త‌రుణ్.. ఆ త‌ర్వాత‌ వరుసగా 5 సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో తీవ్రమైన డిప్రెష‌న్‌కి గురై కుమిలిపోతున్నాడ‌ని స‌మాచారం. అంధగాడు తర్వాత రంగులరాట్నంతో రాజ్ తరుణ్‌కు గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమైంది. రంగులరాట్నం ఏ మాత్రం ఆకట్టుకోక‌పోగా.. తాజాగా వ‌చ్చి రాజుగాడు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ దారుణంగా బోల్తా కొట్టింది.

ఇండస్ట్రీలో ఓ రేంజ్ హీరోకు రెండు ఫ్లాప్ పడ్డాయంటే జాగ్రత్త తీసుకోవాల్సిందే అనే సంకేతాలు మొదలవుతాయి. ఇప్పుడు రాజ్ తరుణ్‌కు అదే పరిస్థితి ఎదురవుతున్నది. ఇప్పుడు కనుక సర్దుకోకపోతే అసలుకే మోసం వ‌చ్చేస్తోంది. అస‌లే వరుస ప్లాప్ లు రావడంతో డిప్రెషన్‌లో ఉన్న రాజ్ తరుణ్ కెరీర్ అప్పుడే అయిపోతుందా అని ఆందోళన చెందాడట. అయితే ఇప్పటికైనా సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నిజంగానే కెరీర్ డోలాయమానంలో పడటం ఖాయం. అయితే ప్లాప్ లు అన్నది సర్వసాధారణం, వాటికి కుంగిపోకుండా సరైన సినిమాలను ఎంచుకుంటే మళ్ళీ ట్రాక్ లోకి రావొచ్చ‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Related News