Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వానా కాలం వచ్చిందంటే అక్కడివాళ్లకు హడల్.వణికిస్తున్న సర్ప భయం..!

Category : editorial

వానా కాలం వచ్చిందంటే అక్కడి ప్రజలు హడలెత్తిపోతారు.బయట అడుగుపెట్టాలంటే ఎక్కడ ఏ పాము కాటేస్తుందోనని భయపడుతారు.కుప్పలు తెప్పలుగా సంచరించే సర్పాలు ఇంట్లోకి ఎక్కడ దూరుతాయోనని వణికిపోతుంటారు.గత సంవత్సరం 350 మంది ఇక్కడ పాము కాటుకు గురయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ఇంతకీ ఏంటా ప్రాంతం అనుకుంటున్నారా.అదే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ..వానా కాలం ప్రారంభంలో పాములు గుడ్లు పెట్టి తమ సంతతిని పెంచుకుంటాయి.పచ్చదనంతో పొదళ్లన్నీగుబురుగా మారి పాములకు ఆవాసాలుగా మారుతాయి.

అవనిగడ్డ ప్రాంతంలో సర్పాల బెడద ఎక్కువ కావడంతో ఇక్కడ వానా కాలంలో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.గడిచిన ఒక్క వారంలోనే ఏడుగురు పాము కాటుకు గురయ్యారు.మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 63మంది పాముకాటుకు గురయ్యారు.దీంతో ఏ క్షణాన ఏ పాము కాటేస్తుందోనని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అయితే అన్ని సర్పాలు విషపూరితమైనవే ఉండవని అధికారులు చెబుతున్నారు.పాము కరిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో బయట సంచరించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.