//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైల్వేజోన్‌ తెచ్చితీరుతాం : సుజనా

Category : politics

ఏదో ఒక విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీకి రైల్వేజోన్‌ తెచ్చితీరుతామని టీడీపీ ఎంపీ, కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి బడ్జెట్‌ నిరాశజనకంగా ఉందని అన్నారు. విశాఖ, విజయవాడకు మెట్రోను బడ్జెట్‌లో ప్రస్తావించలేదని విమర్శించారు.

అలాగే పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. బడ్జెట్‌పై ఆదివారం 4వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ అత్యవసర భేటీ అవుతుందన్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకు చివరి వరకు కృషిచేస్తామని సుజనా చౌదరి పేర్కొన్నారు.

Related News