//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రైల్వే జోన్‌ ఆశలు గల్లంతు...!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా విషయం లో ఇప్పటికే కేంద్రం తన వైఖరిని తేల్చి చెప్పింది. ఎటువంటి పరిస్థితులలో ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పారు. దీనిపై ఆంధ్ర రాష్ట్రము అట్టుడికి పోతుంది, మన ఎంపీ లు కూడా పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపిస్తున్నారు.

ఇప్పుడు మరోసారి కేంద్రం ఏపీ ఫై బాంబ్ పేల్చింది. ఏపీ కి ఇవ్వవలిసిన రైల్వే జోన్ కూడా ఇవ్వడం కుదరదని తెలిచ్చేచారు. అసలు రైల్వేజోన్‌తో ఏమొస్తుంది. ఒక జనరల్‌ మేనేజర్‌ పోస్ట్ అలాగే మరికొందరు ఉద్యోగులు వస్తారంతే అని కేంద్రం చెబుతుంది.

మీకు రైల్వేజోన్‌ కావాలా, రైల్వే లైన్‌ కావాలా అని కేంద్రం ప్రశ్నించింది. ఇదొక్కటే కాదు రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపైనా కేంద్రం నుండి స్పందన రావడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు.

రైల్వే జోన్‌ విషయానికి వచ్చేసరికి, ఇది సాధ్యం కాదని గతంలో ఇచ్చిన నివేదిక గురించి కేంద్రం గుర్తు చేసింది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పడి తీరాలని, కేంద్రం మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గట్టిగా అడిగారు. అలాగైతే ఆ రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది కేంద్ర హోంమంత్రే అని బోర్డు చైర్మన్‌ చెప్పారు. నెలరోజుల్లో హోం మంత్రివద్ద సమావేశం ఏర్పాటు చేద్దామని, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా పిలుద్దామని అన్నారు.