//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక ఇంటి వద్దకే రైల్వే టిక్కెట్లు

Category : national

రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ సైట్‌లో బుక్ చేసే ట్రెయిన్ టిక్కెట్లను డోర్ డెలివరీ రూపంలో పొందవచ్చు. అందుకు గాను నగదును ముందే చెల్లించాల్సిన అవసరం లేదు. టిక్కెట్లను డోర్ డెలివరీ అందుకున్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో నగదును చెల్లించవచ్చు.

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే టిక్కెట్లను ఐఆర్‌సీటీసీ సైట్‌లో కొనే వారు పైన చెప్పిన డోర్ డెలివరీ సదుపాయాన్ని పొందాలంటే మొబైల్ ఓటీపీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఇప్పటికే ఐఆర్‌సీటీసీ అకౌంట్లు ఉన్నవారు ఈ సేవను సైట్‌లోకి లాగిన్ అయి ఉపయోగించుకోవచ్చు. అనంతరం పాన్ లేదా ఆధార్ రెండింట్లో ఏదో కార్డును ప్రూఫ్ కింద ఇవ్వాలి. ఆ పైన టిక్కెట్లను బుక్ చేసే సమయంలో పే-ఆన్-డెలివరీ (పీవోడీ) అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో టిక్కెట్ బుక్ అవుతుంది. ఆ తరువాత టిక్కెట్ డోర్ డెలివరీ అవగానే ప్రయాణికులు నగదును క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో చెల్లించవచ్చు. 

పీవోడీ పద్ధతిలో రైల్వే టిక్కెట్లను కొంటే రూ.5వేల లోపు కొనుగోలుకు గాను రూ.90 వరకు అదనంగా చార్జి పడుతుంది. అదే రూ.5వేలు మించితే అప్పుడు రూ.120 చార్జి వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ పీవోడీ విధానం దేశ వ్యాప్తంగా 600 నగరాలు, పట్టణాల్లో అందుబాటులో ఉంది. 4వేల పిన్ కోడ్‌లలో ఉంటున్న యూజర్లు పీవోడీ సిస్టమ్‌ను ఉపయోగించుకోవచ్చు.

ప్రయాణికులు గరిష్టంగా తమ ప్రయాణానికి 5 రోజుల ముందుగా కూడా ఈ టిక్కెట్లను బుక్ చేసుకునే వీలు కల్పించారు. అయితే ఈ విధానంలో ఒక సారి టిక్కెట్ల‌ను బుక్ చేశాక అవి చేరే లోపే ప్ర‌యాణికులు వాటిని క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిలేష‌న్‌, డెలివ‌రీ చార్జిల‌ను చెల్లించాల్సి ఉంటుంది.

Related News