కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనూహ్యంగా ఆదివారంనాడు కోట జన్శతాబ్ది ఎక్స్ప్రెస్లో ప్రయాణికులతో కలిసి జర్నీ చేశారు. రైలులో సదుపాయాలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏయే ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగుపరచాలనే విషయంలోనూ ప్రయాణికులను ప్రశ్నించి వారి నుంచి సమాధానాలను రాబట్టారు. సదుపాయాలు, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఇటీవల కాలంలో ఎదురురవుతున్న పెరుగుతున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆయన ఈ ఆకస్మిక ప్రయాణం జరిపారు.
ఈనెల ప్రారంభంలో పీయూష్ గోయెల్ రైల్వే బోర్డుకు స్పష్టమైన ఆదేశాలిస్తూ వారానికి ఒకసారి రైల్వే బోర్డు సమావేశం కావాలని, పెండింగ్ సమస్యలను త్వరిగతిన పరిష్కరించాలని చెప్పారు. రైల్వేల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ అవసరమైన సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో జోనల్ జనరల్ మేనేజర్లకు అపరిమితమైన అధికారులు కూడా కల్పిస్తున్నట్టు ప్రకటించారు.