మోడీ సేనలో కలవరం రేపుతున్నారు రాహుల్ గాంధీ. మోడీ వర్సెస్ రాహుల్ ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి మోడీకి రాహుల్ ఏ కోణంలోనూ పోటీ ఇవ్వగల కాదన్న అంశాన్ని ఎక్స్పోజ్ చేయడానికి బీజేపీ ఎన్ని చేయాలో.. అన్నీ చేసింది. చివరకు రాహుల్‌కు పప్పుగా ముద్ర వేస్తూ సోషల్ మీడియాలో అరవీర భయంకరమైన క్యాంపెయిన్ నడిపింది. ఇప్పుడు అదే పప్పు, మోడీ వెనకున్న మిస్టర్ క్లీన్ ముసుగును తొలగించేశాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుందట.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మోడీ సేనకు ఇచ్చిన అతి పెద్ద షాక్ రాఫెల్ రగడే. తొలి నుంచి రాఫెల్ స్కాంను రాహుల్ ఎక్స్‌ఫోజ్ చేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన నుంచి.. అనేక రాష్ట్ర పర్యటనల్లోనూ రాఫెల్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు రాహుల్ గాంధీ. కానీ, ఈ విషయంలో సీరియస్ నెస్ ఇప్పుడు అర్థమవుతుందన్న కామెంట్ ఢిల్లీ నుంచి గల్లీదాక వినిపిస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో మోడీ టీమ్‌కు చుక్కలు చూపించడానికి మోడీ మేనియాను పూర్తిగా ధ్వంసం చేయడానికి రాఫెల్ అస్ర్తాన్ని రాహుల్ గాంధీ సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతుందట. తొలిసారిగా ప్రధాని మోడీ మీద రాహుల్ గాంధీ అప్పర్ హ్యాండ్ సాధించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాహుల్ గాంధీ మొదట ప్రస్తావించినప్పుడు ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, ఒక్కో సాక్ష్యం, ఒక్కో ఆధారంతో ప్రధాని మోడీపై, అనీల్ అంబానీ కంపెనీని మాత్రమే సిఫార్సు చేసిందనే ఆరోపణలకు ఇప్పుడు బలం చేకూరుతుంది. సాక్ష్యాత్తు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ ఇదే విషయాన్ని తేల్చి చెప్పడంతో మోడీ టీమ్ ఉక్కిరిబిక్కిరి అవుతుదంట. దాసో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే కంపెనీ పేరును మోడీ సర్కార్ సిఫార్సు చేసిందని తన ఫ్రెంచ్ జర్నల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇలా రాఫెల్ స్కాంకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఏ పార్టీ అయితే, ఏ నాయకుడైతే తనను పప్పూ అంటూ ఎగతాలి చేశారో ఇప్పుడు వాళ్లందర్నీ రాఫెల్ స్కాంతో బ్లాక్ చేయడంతో రాహుల్ గ్రాండ్ సక్సెస్ సాధించారు. నోట్ల రద్దు, జీఎస్టీ కేంద్రంగా మేడీ ఇమేజ్ దాదాపుగా డ్యామేజ్ అయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు రాఫెల్ కేంద్రంగా రాహుల్ గాంధీ కేంద్రాన్ని హ్యాండ్సప్ స్టేజ్‌కు తీసుకొచ్చారని, 2019 ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయించే అంశాల్లో ఇదే కీలకం కాబోతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఏదేమైనా, మోడీకి చెక్‌పెట్టే సమర్ధవంతమైన నేతగా రాహుల్ గాంధీ తన ఉనికిని బలంగా చాటుకోవడం కమలనాథుల్లో కలవరం రేపుతుందట.