//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ మూడేళ్ళ పాలన ప్రజా తీర్పు వంచన అన్న రాహుల్

Category : national politics

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడేళ్ళ పాలనను పూర్తి చేసుకొంటున్న సందర్భంగా భారీ స్థాయిలో సంబరాలు జరపడం కోసం చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పు బట్టారు. "అసలు మీరు ఎందుకు సంబరాలు జరుపు కోవాలి అనుకొంటున్నారు?" అంటూ వరుసగా ట్వీట్ లలో ప్రశ్నించారు. 

ఇది మూడేళ్ళ ప్రజా తీర్పు వంచన కాలం అంటూ మండి పడుతూ  యువత ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. దేశ సరిహద్దులో జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ప్రభుత్వం ఏం సంబరాలు చేస్తుంది? అంటూ రాహుల్ ప్రశ్నలను సంధించారు. 

ఈ మూడేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పేలవ ప్రదర్శనతో ప్రజలకు ద్రోహం చేశారని అంటూ  రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా మోదీ ఫెస్ట్‌ పేరుతో సంబరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మే 26 నుంచి జూన్‌ 15 వరకు దేశవ్యాప్తంగా 120 నగరాలలో  పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

ముడేళ్ళల్లో ప్రభత్వం సాధించిన విజయాల గురించి పెద్దఎత్తున ప్రచారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  గౌహతిలో మే 26న ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభతో ఈ సంబరాలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.