Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాహుల్‌కు త్వరలో పార్టీ బాధ్యతలు: సోనియా గాంధీ

Posted 3 months ago | Category : national

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మౌనం వీడారు. రాహుల్ పదోన్నతిపై ఆమె స్పందించారు. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ అంశాన్ని సోనియా గాంధీ స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులు ఆమెను రాహుల్ గురించి అడిగారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తారని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో సోనియా కూడా ఆ ప్రశ్నలకు స్పందించారు. పార్టీ చీఫ్‌గా రాహుల్‌కు పదోన్నతి త్వరలోనే జరుగుతుందని సోనియా తెలిపారు. ఇదే విషయాన్ని మీరు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమవుతున్నట్లు సోనియా సంకేతాలిచ్చారు.రాహుల్‌ను కాంగ్రెస్ చీఫ్‌గా ఎన్నుకునేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను సెంట్రల్ కమిటీ చైర్మన్ ముల్లపల్లి రామచంద్రన్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆయన సమర్పించే షెడ్యూల్ ప్రకారం.. త్వరలో సోనియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాతే రాహుల్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతుంది.పార్టీలో జరిగే వ్యవస్థాగత ఎన్నికల ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నట్లు కూడా తెలుస్తున్నది. అన్ని రాష్ర్టాలకు చెందిన కాంగ్రెస్ సంఘాలు.. రాహుల్‌కు అనుకూలంగా తీర్మానం ఆమోదించాయి. ఈనెల చివర్లో కానీ లేదా నవంబర్ మొదటి వారంలో రాహుల్..కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే