Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాహుల్ ప్రధాని కల కలగానే మిగిలిపోనుందా... అవుననే అంటున్నాయి దేశ రాజకీయాలు...?

Category : politics

కాంగ్రెస్ పార్టీ ముందు ఇప్పుడు రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం.. రెండోది ఎలాగైనా మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోవడం. మోడీని అడ్డుకోవాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అది అంత ఆషామాషీ విషయం కాదు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుంది అనుకోవడం కల్లా. ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవాల్సిందే. యూపీఏ అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరు అన్నది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఎప్పటికైనా రాహుల్ ను ప్రధానిగా చూడాలని సోనియా కలలు కంటోంది. ఆ కలలు నెరవేరుతాయా అన్నది చూడాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాహుల్ ను ప్రధాని చేయరు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. యూపీఏ లో ఉండే మిత్రపక్షాలు రాహుల్ ను ప్రధానిగా ఒప్పుకుంటాయా అన్నది సందేహం.

ఎందుకంటే, రాహుల్ కు ఇంకా ఆస్థాయిలో పరిజ్ఞానం లేదు అన్నది వాస్తవం. పైగా ప్రధాని పదవి కోసం పదుల సంఖ్యలో సీనియర్ నేతలు ఎదురు చూస్తున్నారు. వారిని కాదని రాహుల్ కు ఇస్తే మొదటికే మోసం వస్తుంది. అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. యూపీఏ లో భాగస్వాయం అయిన వ్యక్తుల్లో ప్రధాని పదవిని ఆకాంక్షిస్తున్న వారిలో మమతా బెనర్జీ, మాయావతి, శరత్ పవార్ వంటి ప్రముఖులు ఉన్నారు. మాయావతిని ప్రధానిని చేయాలని అఖిలేష్ యాదవ్ అంటున్నాడు. ఎందుకంటే.. మాయావతి సెంట్రల్ కు వెళ్ళిపోతే యూపీ స్టేట్ లో ఎప్పటికైనా తానే ముఖ్యమంత్రి కావొచ్చు. మాయావతికి అవకాశం ఉండదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అటు మమతా బెనర్జీకూడా ప్రధాని పదవిపై కన్నేసింది. శరత్ పవార్ తాను పోటీలో లేనని అంటున్నా... ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పోటీ పడొచ్చు. వీరితో పాటు కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇస్తున్న చంద్రబాబు కూడా లైన్లో ఉన్నారు. వీరే కాదు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎందరో ఆ పదవిని ఆశపడుతున్నారు. వీరి ఆశలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.

Related News