//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాహుల్ గాంధీలో మంచి నాయకత్వ లక్షణాలు

Category : national

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటూ, ఇది మేము అంటున్న మాట కాదు ఆ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్‌ అన్న మాటలు ఇవి. అంతేకాదు రాహుల్ పార్టీ నేతలతో మరింత మమేకం కావాల్సిన అవసరముందని ఆమె అభిప్రాయపడ్డారు. తన తల్లి సోనియా గాంధీ లాగా రాహుల్‌ కూడా ప్రతి రోజూ పార్టీ ప్రధాన కార్యాలయానికి రావాలని, ఆమె పార్టీ కార్యాలయంలో రెండు నుంచి మూడు గంటల పాటు ఉండేవారని, రాహుల్ కూడా తన తల్లి లాగానే రోజూ పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యకలాపాలు విషయంలో మరింత శ్రద్ద వహించాలని ఆమె కోరారు.

తన తల్లి సోనియా గాంధీ నడిచిన రాజకీయ పధంలో రాహుల్ కూడా నడిస్తే అప్పుడు తప్పకుండ కాంగ్రెస్ కార్యాలయంలో సందడి నెలకొంటుందని, ముందు ముందు పార్టీకి తిరిగి మంచి రోజులు వస్తాయని, మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్థానంలోకి ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రానునున్నారనే వూహాగానాల నేపథ్యంలో షీలా దీక్షిత్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ.