//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Category : politics

బీజేపీ అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. మేఘాలయా టూర్ లో,షిల్లాంగ్ లో రోడ్ షో తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి పరికరం అని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అయన జన్ థన్ లూట్ యోజన పథకం కింద స్కామ్ లు చేస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు.

ఆర్థిక అవకతల ఘటనలు దేశాన్ని కుదిపేస్తుండటాన్ని మోదీ 'జన్ ధన్ లూట్ యోజన'గా సంబోధించారు. 390 కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసం చేసిన వజ్రాల ఎగుమతిదారు సభ్యసేత్ వ్యవహారం తాజాగా వెలుగులోకి రావడంపై రాహుల్ స్పందిస్తూ మోదీ ప్రతిష్ఠాత్మక స్కీమ్‌ కాస్తా 'జన్ ధన్ లూట్ యోజన'గా మారిందంటూ ట్వీట్ చేశారు.

మోదీజీ 'జన్ థన్ లూట్ యోజన' కింద మరో స్కామ్ 390 కోట్లు. ఢిల్లీకి సంబంధించిన జ్యూయెలర్ ప్రమేయం. నీరవ్ మోదీ నేరం చేసిన తరహాలోనే నకిలీ ఎంఓయూలతోనే. మాల్యా, నీరవ్‌ల మాదిరిగానే ఈ ప్రమోటర్ కూడా మాయమయ్యాడు. ఈ ప్రభుత్వం ఎటో చూస్తోంది అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలు మోడీ హయంలోనే జరుగుతున్నాయి. మోడీ ప్రచారం కోసం ఖర్చు చేసే డబ్బు వారి నుంచే వస్తుందని వాపోయారు.ఈ వరుస ఘటనల పై దేశంలో ఆందోళనలు నెలకొంటున్నాయి.