//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాహుల్ గాంధీ పట్టాభిషేకం ఈ నెల 30న?

Category : national

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పదోన్నతి లభిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి అధికార పగ్గాలను ఎప్పుడు స్వీకరిస్తారో స్పష్టత లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 26న ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అనంతరం ఈ నెల 30న ఆయన సోనియా గాంధీ నుంచి అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారని సమాచారం. సోనియా గాంధీ 19 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడైతే, 1947 తర్వాత ఆ పదవిని చేపట్టిన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఐదో వ్యక్తి అవుతారు.