//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజకీయ వర్గాల్లో సంచలనంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

Category : national

వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళి ప్రధాని అయ్యే అవకాశం లేదనేది చాలా మంది వాదన. ఆయనను ప్రధానిగా చూడటం అనేది చాలా మందికి ఇబ్బందిగా ఉందని దీనికి ఆయన ప్రవర్తనే కారణం అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా లేదా మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎవరు కూడా మోడీ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు అనేది వాస్తవం. దీనికోసం ఇప్పటి నుంచి సంఘ్ సహా ఇతర పార్టీలు ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నాయి.

అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి వాదన. రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలు సరికొత్తగా ఉన్నాయని అందుకే మళ్ళి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో వచ్చిన గుజరాత్ ఎన్నికలు కర్ణాటక ఎన్నికలు రాహుల్ గాంధీ సామర్ధ్యాన్ని పెంచాయనే చెప్పాలి. గుజరాత్ ఎన్నికల్లో అయితే బిజెపి చచ్చి బ్రతికింది. అయితే తాజాగా రాహుల్ గాంధీ మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే..

నా మాటలకు మీరిప్పుడు నవ్వవచ్చు. కానీ, 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత, బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు. ప్రతిపక్షాల ఐక్యత బీజేపీని అధికారంలోకి రానివ్వదు. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ బీజేపీని గద్దె దింపాలనే చూస్తున్నారు.

ఇక ఇప్పుడు ఇది వ్యూహాత్మక రాజకీయ యుద్ధం కాదు. సిద్ధాంతంపై పోరాటం. దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ చేతులు కలుపుతారు.

ప్రతిపక్షాలు కలిసికట్టుగా ఉంటే ఎంత శక్తిమంతమో చెప్పడానికి ఇటీవలి ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికలే నిదర్శనం. అక్కడ ఈసారి బీజేపీకి ఎంపీ సీట్లు ఐదు కూడా దాటవు. ఉమ్మడి ప్రతిపక్షాన్ని మోదీ ఎదుర్కోలేరు.

నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనేది దాదాపు అసాధ్యం. ఈ విషయంలో నేను ‘పూర్తి విశ్వాసం’తో ఉన్నాను. ఓటమి కళ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయం ఆయనకూ తెలుసు. అంతేనా.. వారణాసిలో కూడా ఆయన గెలవలేరు.

మోదీ కేవలం తన మనసులోని మాట (మన్‌ కీ బాత్‌)నే చెబుతున్నారు. తప్ప, దేశం ఆయనకు ఏం చెప్పాలనుకుంటోందో వినడం లేదు.

ఉన్నావ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అయినా, మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

కర్ణాటకలోనే కాదు.. ఛత్తీస్ గఢ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ విజయం తథ్యం.

రాబోయే పదేళ్లలో కాంగ్రెస్‌ నుంచి దేశవ్యాప్తంగా కనీసం పదిమంది మహిళా ముఖ్యమంత్రులను చూడాలనేది నా ఆకాంక్ష. నా ప్రకటనతో ఇక్కడున్న చాలామందికి, మరీ ముఖ్యంగా సీనియర్లకు కోపం తెప్పిస్తుందని నాకు తెలుసు. కానీ, నేను నిర్దేశించబోయే ఎజెండా ఇదే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 12 మంది మహిళలకే టికెట్లు ఇవ్వడం నాకు నచ్చలేదు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ‘శుద్ధమైన రాజకీయాలకు, మురికి రాజకీయాలకు’ మధ్య పోరాటం. మాఫియాకు, ప్రజలకు మధ్య పోరాటం.

ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో

పోటీ చేస్తున్నారు. అవినీతిపరులైన రెడ్డి గ్యాంగ్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మా అభ్యర్థులకు

నిధుల సేకరణకు మేం వినూత్న వైఖరిని ప్రారంభించాం. విరాళాలు ఇవ్వడం ద్వారా అభ్యర్థికి మద్దతు పలకండి.

Related News