//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడివి పిల్ల చేష్టలు

Category : national politics

ఎన్నో ఆశలు చూపించి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ పెట్రోల్ ధరల విషయంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు. అయితే తాజాగా మోడీ పెద్ద మనసుతో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒక పైసా తగ్గించడాన్ని సామాన్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. పెంచే సమయంలో రూపాయల్లోనూ.. తగ్గించే సమయంలో పైసల్లోనూ.. అదీ ఒక్క పైసా తగ్గించడమేంటని మండిపడుతున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ తగ్గింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రధానిని ఉద్దేశించి ఈ వ్యవహారంపై ట్వీట్ కూడా చేశారు. ఇవాళ పెట్రోల్, డీజిల్‌పై ఒక పైసాను తగ్గించారని.. ఇదేం తగ్గింపు అని.. కేవలం ఒక పైసా ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలను వేళాకోళం చేయడమే మీ ఉద్దేశమైతే.. ఇది పిల్ల చేష్ట అని రాహుల్ చెప్పారు. ఇది నిజంగా చౌకబారుతనమని ట్వీట్ చేశారు. తాను విసిరిన ఛాలెంజ్‌కు ఇది తగిన స్పందన కాదని మోదీని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు.