//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ

Category : national

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.సెల్ఫీల పట్ల ప్రధాని మోజు పడుతున్నారని, దీని వల్ల చైనాకు లాభం చేకూరుతోందని అన్నారు.ప్రధాని చేపట్టిన ‘మేకిన్‌ ఇండియా’ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.మీరు తీసుకునే సెల్ఫీ వల్ల చైనాలో యువతకు లాభం. ఇక్కడి వారికి కాదు’ అంటూ విమర్శించారు.తయారీ రంగంలో చైనా అక్కడి యువతకు ఉపాధి కల్పిస్తుంటే.. భారత్‌ మాత్రం యువతను నిరుద్యోగులుగా మారుస్తోందని అన్నారు.గత వారం గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో పాల్గొన్న రాహుల్‌ అక్కడివారిని ఫోన్లు చూపాలని చెబుతూ ‘మీ ఫోన్లు భారత్‌లో తయారవుతున్నాయా? లేదా చైనాలోనా’ అంటూ ప్రశ్నించారు.మీరు ఫోన్‌ బటన్‌ నొక్కే ప్రతిసారి ఒక యువకుడికి చైనాలో ఉద్యోగం లభిస్తోంది’ అని చెప్పారు.చైనా ప్రభుత్వం ప్రతి 24 గంటలకు 50 వేల మందికి ఉపాధి కల్పిస్తుంటే భారత్‌లో మాత్రం ఆ సంఖ్య 450 మాత్రమే అని అన్నారు.హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ నెల 9న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది.ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు భాజపా తరఫున ప్రధాని మోదీ, అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు...