Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బంగాళదుంపతో బంగారం తయారుచేసే యంత్రాన్ని తీసుకొస్తా - రాహుల్ !

Posted 2 months ago | Category : national

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో పప్పు గా సోషల్ మీడియా లో బాగా ఫేమస్ అయిన ఆయన ఏం చేసినా ఇటీవల వైరల్ అయిపోతోంది.

ఒకానొక దశలో రాహుల్ ని పప్పు అంటేనే కేసులు నమోదు చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటన చేసిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా రాహుల్ మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. దీంతో రాహుల్‌ను విమర్శిస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా అహ్మదాబాద్‌లోని నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతుండగా ఆయన ... తాను ఆలుగడ్డ (బంగాళదుంప)తో బంగారం తయారుచేసే యంత్రాన్ని తీసుకొస్తానని ఇటువైపు నుంచి ఆలుగడ్డ పెడితే అటువైపు నుంచి బంగారం వస్తుందని చేతులు ఊపుతూ చెప్పినట్టున్న ఒక వీడియో బయటకి వచ్చింది. అంత డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ప్రజలు బుర్రలు బద్దలుగొట్టుకుంటారని ఆయన పేర్కొన్నారు.

దీంతో ‘‘ఇటువైపు నుంచి ఆలుగడ్డ పెడితే అటువైపు నుంచి బంగారం బయటకు వస్తుంది. అలాంటి మెషీన్‌ను తీసుకొస్తా’’ అని రాహుల్ అన్నట్టు ఉన్న 20 సెకండ్ల వీడియో సంచలనమైంది. అయితే గత కొంత కాలంగా రాహుల్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా బీజేపీ ప్రభుత్వం విధానాలపైనా, ప్రధాని నరేంద్రమోదీపైనా విరుచుకుపడుతున్నారు. అయితే తాజా ఘటన అందుకు పూర్తిగా విరుద్ధం.

రాహుల్ అలా అన్న మాట వాస్తవమే అయినా వాస్తవంలోకి వెళితే రాహుల్ మొత్తం 26 నిమిషాలు మాట్లాడితే అందులో కేవలం 20 సెకన్ల పాటు ఉన్న వీడియోను కట్ చేసి అప్‌లోడ్ చేశారు. నిజానికి రాహుల్ మొత్తం 26 నిమిషాలు మాట్లాడితే అందులో 17 నిమిషాలు ప్రధాని మోదీని ఎండగట్టారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని రూ.40వేల కోట్లు ఇస్తామన్నారని, కానీ పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నెలరోజుల క్రితం ఇక్కడ వరదలు వస్తే రూ. 500 కోట్లు సాయం చేస్తానన్నారని కానీ, రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

అలాగే మోదీ ఇటీవల ఓ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘‘ఐసీ మిషన్ లగా ఊంగా, ఇస్ సైడ్ సే ఆలూ గుసేగా, ఉస్ సైడ్ సే సోనా నికలేగా’’ (ఈ వైపు నుంచి ఆలుగడ్డలు పెడితే, ఆవైపు నుంచి బంగారం వస్తుంది. అలాంటి మెషీన్‌ను తీసుకొస్తా) అని ప్రధాని అన్నారని పేర్కొన్నారు. దీంతో ముందు వెనుకా కట్ చేసిన మోడీ అభిమానులు రాహుల్ ని మరో మారు నవ్వులపాలు అయ్యేలా చేశారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !