//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రికెటర్ రహనే తండ్రి అరెస్ట్ !

Category : sports

టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే తండ్రి మధుకర్ బాబురావ్ రహానే ని పోలీసులు అరెస్టు చేశారు.

ఓ యాక్సిడెంట్ కేసులో మహారాష్ట్రలోని కొల్హాపూర్ పోలీసులు ఈరోజు ఆయణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే మధుకర్ ప్రయాణిస్తున్న కారు 67 ఏళ్ల అస్తాయ్‌ కాంబ్లే అనే మహిళను ఢీకొట్టడంతో స్థానికులు సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది.

దీంతో పోలీసులు ఆయణ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ మేరకు రహానే తండ్రి మధుకర్‌ రహానేపై ఐపీసీ సెక్షన్‌ క్రింద 304 ఎ, 337, 338, 184 నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొల్హాపూర్ సమీపంలోని జాతీయ రహదారి నంబర్‌ 4 పై ఈ ప్రమాదం జరిగింది. కుటుంబంతో కలిసి హ్యూండయ్‌ కారులో వెళుతుండగా కంగల్‌ ఏరియా పరిధిలో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో రహానే తండ్రితో పాటు అతని తల్లి, సోదరి కారులో ప్రయాణిస్తున్నారు.

అయితే.. ఆ కారును మధుకరే డ్రైవ్ చేస్తున్నారా, లేదా ఇంకెవరైనా డ్రైవ్ చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. సుదీర్ఘ క్రికెట్ షెడ్యూల్ నుంచి స్వల్ప విశ్రాంతి తీసుకున్న రహానే.. కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా గడపటానికి ఇటీవలే ఇంటికి వచ్చాడు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.