Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'ప్రజాసంకల్పయాత్ర' లో నెత్తిమీద ముద్దులు, సెల్పీలు తప్ప ఇంకేమీ లేవు : రఘువీరా రెడ్డి

Category : state politics

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఈరోజుతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం ఇచ్చాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో వైసీపీ,జగన్ వ్యవహారాల శైలిపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడూ రఘవీరా రెడ్డి తీవ్రంగా స్పందించారు.

రఘవీరా రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రజాసంకల్పయాత్రపై వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప అందులో ఏమి లేదని విమర్శించారు. జగన్ పద యాత్రలో రోజుకు 2కోట్లరూపాయలు ఖర్చు పెట్టారని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో ఏపీలో పోతు పెట్టుకోవడంపై ఏదోకటి త్వరగా తేల్చాలని హైకమాండ్ ను కోరినట్టు రఘువీరా రెడ్డి వెల్లడించారు. జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, నెత్తిమీద ముద్దులు తప్ప ఏమీ లేవని వ్యాఖ్యలు చేశారు.