Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"కాంచన -3 లో రాఘవ లారెన్స్" లుక్ చూస్తే....!

Category : movies

రాఘవా లారెన్స్‌ ఈ పేరు వింటే సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆల్ రౌండర్ గాను అన్ని విభాగాల్లో తన మార్క్ స్టైల్ కొత్తదనాన్ని చూపించగల బహుముఖ ప్రజ్ఞాశాలి గా డాన్స్ మాస్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా ప్రూవ్ చేసుకుని, దర్శకుడిగా సినిమా పై తన పట్టు ఏంటో నిరూపించుకుని. సంగీత దర్శకుడి గా ఇలా ఒకటా రెండా సినిమాకి సంబంధించి ప్రతి క్రాఫ్ట్ లో తన మార్క్ చూపిస్తూ ... ప్రయోగాలకు పెట్టింది పేరు గా తాను తీసిన ముని, కాంచన సీక్వెల్ ఎంతో పెద్ద ఘనవిజయాన్ని అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇపుడు ఇదే సినిమాకు మరో సీక్వెల్ రానుంది. కాంచన 3 రెడీ అవుతోంది.

గత కాంచన సినిమాల సీక్వెల్ లాగే రాఘవా లారెన్స్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓవియా, వేదిక, సత్యరాజ్,కోవై సరళ, కబీర్‌ దుహన్‌ సింగ్,శ్రీమాన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు . ఈ సినిమాను తెలుగులో లైట్‌హౌస్‌ మూవీమేకర్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై బి. మధు సమర్పణలో రాఘవేంద్ర ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రాఘవ లారెన్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను ఈ చిత్ర బృందంవిడుదల చేశారు. ఈ సినిమా లో ప్రత్యేకంగా

డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ని ఉపయోగించి నట్టు ఈ సినిమా టీమ్‌ చెప్పింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 18న విడుదల చేయాలనుకుంటున్నట్టు. ఈ చిత్ర తెలుగు నిర్మాత మధు మాట్లాడుతూ కాంచన పేరుతో స్టార్ట్‌ అయిన తర్వాత ఇది కాంచన–3. ఇప్పటికే కాంచన పేరుతో వచ్చిన ప్రతి మూవీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు ఇది వరుసగా నాలుగో సినిమా....

ఆయన ప్రతి చిత్రంలో తన గెటప్‌ని సామాన్య ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా చూసుకుంటారు. గత మూడు చిత్రాలకు మించి కాంచన 3 ఉండబోతుంది అని ఆయన అన్నారు.

Related News