రఫెల్ నాదల్ మరోసారి తన సత్తా చాటాడు. క్లే కోర్టు మీద తనకు తిరుగులేదని నిరూపిస్తూ ఐదోసారి మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో ఒక ర్యాంక్ ను మెరుగుపరుచుకుని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్పెయిన బుల్ రఫెల్ నాదల్ నాలుగో ర్యాంక్‌కు చేరుకున్నాడు. బ్రిటన ప్లేయర్ ఆండీ మర్రే టాప్‌లో కొనసాగుతుండగా.. జొకోవిచ (సెర్బియా) రెండో ర్యాంక్‌లో నిలిచాడు. స్విస్ ఆటగాళ్లలో వావ్రింకా మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రోజర్ ఫెడరర్ 5వ ర్యాంక్‌కు పడిపోయాడు. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో జర్మన భామ ఏంజెలిక్ కెర్బర్.. సెరెనా విలియమ్స్‌ను వెనక్కునెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది.