//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాలి మీద గోకాడు అందుకే చెంప పగలకొట్టా !

Category : movies

ఈ మధ్య కాలంలో సంచలన విషయాలు బయటపెడుతూ వార్తలలో నిలుస్తోంది బాలీవుడ్ నటి రాధికా ఆప్టే.

తెలుగులో లెజెండ్, రక్త చరిత్ర, లయన్ వంటి సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత కాలంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల కెక్కింది. ఆ తరువాత కాస్త సైలెంట్ అయింది అనుకున్నా ఇటీవల బాలీవుడ్ నటి నేహా ధూపియా చేస్తున్న ఓ టాక్ షో లో పాల్గొన్న రాధిక మరో సారి దక్షిణాది హీరో మీద నోరు పారేసుకుంది.

ఇది తన దక్షిణాది కెరీర్ లో మొదటి సినిమా అనుభవం అని చెప్పిన ఆమె, ఆ రోజు షూట్ మొదటి రోజు హీరో పక్కన కుర్చుని ఉన్నానని, కాసేపటికి తనను అసభ్యంగా ఆ స్టార్ హీరో తన అరికాళ్ళ మీద రుద్దాడని, వెంటనే ఆ హీరో చెంప పగల కొట్టానని ఆమె తన అనుభవాన్ని పంచుకుంది.

ఇప్పటికే సినిమా రంగంలో మహిళల మీద జరుగుతున్న వేధింపుల గురించి అటు హాలీవుడ్ నుండి ఇటు మల్లువుడ్ దాకా తారలు నోరు విప్పుతున్న తరుణంలో ఇప్పుడు రాధికా వ్యాఖలు మరో దుమారాన్ని రేపెలా ఉన్నాయి.