Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలో చేరిన పీవీపీ ... ఏపీలో సరికొత్త సమీకరణాలు

Category : state politics

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పైన పార్టీలో దృష్టి పెట్టాయి. విజయావకాశాలు ఉన్న అభ్యర్థుల కే పట్టం కట్టాలని నిర్ణయించుకున్న పార్టీలు సిట్టింగులకు సైతం షాక్ ఇస్తున్నాయి.

ఒకపక్క ఏపీ రాజకీయాల్లో సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టిడిపి ప్రయత్నాలు చేస్తుంటే, ఈసారి కచ్చితంగా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని వైసిపి పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెలుపు గుర్రాలను బరిలోకి దించుతున్నారు ఇరు పార్టీల అధినేతలు. ఈ క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఒక ఓ ముఖ్య నాయకుడిని, ప్రముఖ పారిశ్రామిక వేత్తను తమ పార్టీలో చేర్చుకుంది. కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు.

ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు చేరుకున్న పొట్లూరి జగన్‌తో సమావేశమయ్యారు.అనంతరం వరప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన కాకినాడ ఎంపీ తోట నర్సింహులు ఆయన భార్య వాణితో కలిసి బుధవారం జగన్‌తో భేటీ అయ్యారు.  ఈ క్రమంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.

Related News