//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉదారత చాటుకున్న పివి సింధు

Category : sports

ప్రముఖ షట్లర్ పీవీ సింధు తన ఉదారతను చాటుకుంది. బసవ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి రూ.25 లక్షలను విరాళంగా అందజేశారు. సింధు తన తల్లిదండ్రులతో కలిసి బసవ తారకం ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణను కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును ఆయనకు అందజేశారు.

అనంతరం, సింధు మాట్లాడుతూ, కేబీసీలో బహుమతిగా గెలుచుకున్న రూ.25 లక్షలను కేన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇవ్వడం తనకు సంతోషంగా ఉందని చెప్పింది. ఈ విరాళం ఇవ్వమని తనకు ఎవరూ చెప్పలేదని, ఈ ఆసుపత్రికి విరాళమిస్తే బాగుంటుందని ఎందుకో తనకు అనిపించిందని తెలిపింది.ఈ ఆసుపత్రి పేద ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, అందరి దీవెనలతో మరిన్ని విజయాలు తాను సాధించాలని కోరుకుంటున్నానని అంటూ సింధు నవ్వులు చిందించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, పేదలకు మరిన్ని సేవలు అందించేందుకు బసవతారకం ఆసుపత్రి కృషి చేస్తుందని అన్నారు. ఏదైతే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించారో, ఆ లక్ష్ఃంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కేన్సర్ ఆసుపత్రికి విరాళమిచ్చిన పివి సింధుకి, ఆమె తల్లిదండ్రులకు తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.