భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన మానవత్వాన్ని చాటుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి రూ.25లక్షలు విరాళం ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. సోనీ టీవీలో ప్రసారమవుతున్న‘ కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో శుక్రవారం రాత్రి పాల్గొన్న పీవీ సింధు తన టాలెంట్‌తో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకి చక్కగా సమాధానాలు చెప్పి రూ.25 లక్షలు గెలుచుకుంది.ఈ టీవీ షో ద్వారా గెలుచుకున్న మొత్తాన్ని క్యాన్సర్ రోగుల సహాయార్థం అందజేస్తానని సింధు ఇటీవల ప్రకటించింది. పీవీ సింధుని ఆదర్శంగా తీసుకుని క్యాన్సర్‌పై జరిపే పోరాటంలో మరింత మంది భాగస్వామ్యులు కావాలని ఆసుపత్రి అధికారులు కోరారు.