ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు కాంస్య పతకాలు సాధించిన తెలుగుమ్మాయి పీవీ సింధు మరో పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో అద్భుత విజయం సాధించిన ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ సన్ యూపై ఆధిపత్యం ప్రదర్శించి 21-14, 21-9 తేడాతో సింధు విజయం సాధించింది.
ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ప్రత్యర్థి పుంజుకునేందుకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిన సింధు ముందు సన్యూ నిలవలేకపోయింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇది ఆమెకు మూడో పతకం కానుండటం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ కూడా సింధునే. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.