//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Category : sports

పి. వి. సింధు పూర్తీ పేరు పూసర్ల వెంకట సింధు. జూలై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది.ఆ దంపతులిద్దరూ వాలీబాల్ క్రీడాకారులు. రమణ పూర్వీకులు పశ్చిమ గోదావరి జిల్లా జిల్లాకు చెందిన వారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జన్మించారు.ఉద్యోగ రీత్యా గుంటూరుకు తరలి వెళ్ళారు.

రమణ తన వాలీబాల్ కెరీర్ కోసం, రైల్వేలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌లోలో స్థిరపడ్డారు. తల్లి విజయ స్వస్థలం విజయవాడ . 2000 లో రమణకు అర్జున పురస్కారం లభించింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వాలీబాల్ ఆటగాళ్ళైనా సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. అప్పటికి గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలిచి వార్తలలో వ్యక్తిగా ఉన్నాడు.సింధు ఎనిమిదేళ్ళ వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది.

సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది.

ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.

2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.2013 లో తొలిసారి ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో ఆడిన తెలుగు అమ్మాయి, ప్రపంచ 12వ ర్యాంకర్ పి.వి.సింధు సంచలనం నమోదు చేసింది. తన కంటే మెరుగైన ర్యాంకులో ఉన్న చైనా క్రీడాకారిణిని ఓడించి కార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

2016 రియో ఒలింపిక్స్ పతకాల కోసం భారత్ తల్లడిల్లుతున్న సమయంలో పి.వి.సింధు భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో గ్రూప్ ఎంలో కెనడాకు చెందిన మిషెల్లీ లీను 2-1 తేడాతో, హంగరీకి చెందిన లారా సరోసీని 2-0 తేడాతో ఓడించి 16వ రౌండులో చైనీస్ తాయ్ జూ యింగ్ పై 2-0 తో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.

క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ ఇహాన్‌ను 2-0 తో ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. 2016, ఆగస్టు 18వ తేదీ జరిగిన సెమీ ఫైనల్స్‌లో జపాన్‌ క్రీడాకారిణి నొజోమి ఒకుహరాతో వీరోచితంగా పోరాడి 2-0 తో ఆమె పై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది.

2016, ఆగస్టు 19వ తేదీన జరిగిన ఫైనల్స్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ తో వీరోచితంగా పోరాడి 21-19, 12-21,15-21 పాయింట్లతో పరాజయం పాలయింది. ఈ ఒలింపిక్స్‌లో మహిళల సింగల్స్ బ్యాడ్‌మింటన్‌లో ద్వితీయ స్థానం పొంది ఈ క్రీడలలో భారత్‌కు తొలి మరియు ఏకైక రజత పతకాన్ని సంపాదించిపెట్టింది.

సింధు కి జాతీయ ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, జాతీయ అత్యుత్తమ క్రీడా పురస్కారం 2016 ఇచ్చింది. అలాగే పద్మశ్రీ అవార్డు (2015),అర్జున అవార్డు (2014) ఆమె బ్యాట్మెంటన్ లో విశేషం రాణించినందుకు ఇచ్చారు.

Related News