Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహేష్ బాబును అవమానపరచిన పూరీ జగన్నాద్..?

Category : movies

పోకిరి,బిజినెస్ మ్యాన్ మహేష్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు మహేష్ ని స్టార్ హీరో ఇమేజ్ కి దగ్గర చేసాయి.అయితే అలాంటి పూరీ దర్శకత్వంలో మహేష్ బాబు జనగణమన సినిమా చేయబోతున్నాడనే న్యూస్ గత ఐదారేళ్లగా ప్రచారం జరిగింది.కానీ పూరి జగన్నాథ్ అప్పుడు వరస ప్లాప్స్ తో సతమతమవడం వలన పూరితో సినిమా చెయ్యడానికి మహేష్ వెనకాడాడు.మహేష్ ని దృష్టిలో పెట్టుకుని పవర్ ఫుల్ జనగణమన స్క్రిప్ట్ రాసుకుని మహేష్ చుట్టూ తిరిగిన పూరికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చుక్కలు చూపించాడు.

ఏది ఏమైనా కూడా "జనగణమన" సినిమాని కచ్చితంగా మహేష్ తోనే చెయ్యాలని పూరి డిసైడ్ అయ్యాడు.కానీ అది కుదరలేదు.అయితే గత కొన్నాళ్లుగా ప్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాధ్ తాజాగా రామ్ హీరోగా తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" సినిమా హిట్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది.అయితే "ఇస్మార్ట్ శంకర్" ఇంటర్వూస్ లో భాగంగా పూరి జగన్నాధ్,మహేష్ బాబు తో కలిసి చెయ్యాల్సిన జనగణమన సినిమా ప్రస్తావనవచ్చింది.అయితే పూరి జగన్నాథ్ పోకిరి,బిజినెస్ మ్యాన్ చేసిన మహేష్

కన్నాఎక్కువగా ఆయన అభిమానులంటే తనకిష్టమని చెప్పడమే కాదు.మహేష్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు.మహేష్ బాబు కేవలం హిట్స్ ఉంటేనే నాతో సినిమా చేస్తాడని లేకపోతే అసలు పట్టించుకోడని సంచలనంగా మాట్లాడాడు.మరి ఇస్మార్ట్ తో హిట్ కొట్టిన మీకు ఒకవేళ మహేష్ బాబు పిలిచి జనగణమన సినిమా చేద్దామని అడిగితే చేస్తారా.? అంటూ సదరు యాంకర్ ప్రశ్నించగా.మహేష్ కి ఒకే చెప్పడానికి నాకంటూ ఓ క్యారెక్టర్ ఉంటుంది అని తేల్చి చెప్పేశాడు.పూరి జగన్నాధ్ మాటలని బట్టి చుస్తే మహేష్ తో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.