//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్.. హాట్ బ్యూటీ ఛార్మి.. టాలీవుడ్‌లో మొద‌లైన గుస‌గుస‌లు..!

Category : movies

టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌.. ఎఫైర్ న‌డుస్తోందంటూ వార్త‌లు మీడియాలో జోరుగా సాగినా.. అవేమి ప‌ట్టించుకోకుండా.. వారిద్ద‌రు వారి ప‌ని వారు చేసుకుంటూపోతున్నారు. గ‌తంలో ఛార్మిని నటిగా నిలబెట్టడానికి డైరక్టెర్ పూరి జగన్నాథ్ చాలా కష్టపడ్డారు. ఉమన్ ఓరియెంటెడ్ సినిమా జ్యోతిలక్ష్మి తీశారు. ఈ చిత్రంలో వేశ్యగా ఛార్మి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమా ఆమెకు అభినందనలు తెచ్చిపెట్టినప్పటికీ.. అవకాశాలను మాత్రం తీసుకురాలేకపోయింది.

అయినా కూడా పూరి ఛార్మిని వదల్లేదు. పూరి కనక్ట్స్ అనే కంపెనీని పెట్టి.. దాని బాధ్యతలను ఛార్మి చేతులో పెట్టారు. టాలీవుడ్ కి అందమైన భామలను అందించడమే ఈ కంపెనీ లక్ష్యం. ఈ బాధ్యతను ఛార్మి చక్కగా నెరవేర్చింది. పూరి తీసిన పైసా వసూల్, మెహబూబా సినిమాలకు లేడీ ఆర్టిస్టులను సరఫరా చేసింది. అయితే మెహబూబా పూరీకి ఉన్న కాస్త‌ ఇమేజ్‌ని కూడా పాతాళానికి తొక్కేసింది. రెమ్యునరేష్ తీసుకోకుండా పని చేస్తానని చెప్పినా నిర్మాతలు ముందుకు రావడం లేదు. మంచి సినిమా తీస్తానని మొత్తుకున్నా స్టార్ హీరోలు పూరీకి దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. దీంతో డీలా పడిపోయిన పూరీకి ఛార్మి అండగా నిలుస్తోంది. తనకున్న పరిచయంతో ఓ స్టార్ హీరోని పూరీతో నిమా చేయించడానికి ఒప్పించింద‌ని చిత్ర పరిశ్ర‌మ‌లో ఓ టాక్ న‌డుస్తోంది. మ‌రి ఈ వార్త ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.