//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్.. పూరీ జ‌గ‌న్నాథ్ @ 20 కోట్లు..?

Category : movies

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్‌ను హీరోగా ప‌రిచ‌యం చేసిన మెహ‌బూబా భారీగానే నష్టాలు మిగిల్చింది. దీంతో పూరి త‌న‌యుడు కోసం కోట్ల రూపాయ‌ల ఖ‌రీదైన ఇల్లు అమ్మి సినిమా చేసాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ భారీ డిజాస్ట‌ర్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారీగానే న‌ష్టాలు భ‌రించాల్సి వ‌చ్చింది. నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేసినా.. మిగ‌తా చోట్ల పూరి మీద న‌మ్మ‌కంతో డిస్ర్టిబ్యూట‌ర్లు అండ‌రస్టాండింగ్ మీద‌ సినిమా కొని రిలీజ్ చేసారు. ఇప్పుడు దిల్ రాజ్ స‌హా అంతా మెహ‌బూబా బాధితులే. పూరీనే తిరిగి డ‌బ్బులివ్వాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఈ నేప‌థ్యంలో పూరీ మ‌రో ఇంటిని తాక‌ట్టు పెట్టి తెచ్చిన అప్పుల‌ను, డిస్ర్టిబ్యూట‌ర్ల‌కు చెల్లించాల్సిన డ‌బ్బును తిరిగిస్తున్న‌ట్లు స‌మాచారం. ఓస్టార్ డైరెక్ట‌ర్ వ‌ద్ద పూరి ఖ‌రీదైన మ‌రో ఇంటిని 20 కోట్ల‌కు తాక‌ట్టు పెట్టిన‌ట్లు స‌మాచారం.

ఆ డ‌బ్బులో దిల్ రాజు కు నాలుగున్నర కోట్లు, మిగ‌తా వారి బ‌కాయిలు చెల్లించ‌నున్నాడుట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇండ‌స్ర్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టికే ఆయ‌న సినిమా నిర్మాణం కోసం ఓ ఇల్లు అమ్మేశాడు. సినిమా హిట్ అయితే అమ్మిన ఇంటిని మ‌ళ్లీ చేజిక్కించుకోవాల‌ని అనుకున్నాడు. తీరా సీన్ రివ‌ర్స్ అయ్యే స‌రికి ఉన్న మ‌రో ఇంటిని తాక‌ట్టు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందని తెలుస్తోంది. 20 కోట్ల‌లో మిగిలిన డ‌బ్బుతో మ‌ళ్లీ పూరి త‌న‌యుడితోనే సినిమా చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే రెండ‌వ సినిమా కూడా నాన్న‌తోనే వెంట‌నే ఉంటుంద‌ని ఆకాష్ తెలిపాడు. పూరీ కూడా పొగొట్టిన చోట‌నే రాబ‌ట్టుకునే టైపే.. అందుకే సంపాదించిందంతా చుట్టూ ఉన్న వారు దోచుకుపోయినా.. నిల‌బ‌డి మ‌ళ్లీ గెలిచాడు. ఇలాంటి చిన్న ప‌రాజ‌యం పూరికి లెక్క కాదు. ఆ కాన్ఫిడెన్స్ తోనే మ‌రోసారి త‌న‌యుడితో సిద్ద‌మ‌వుతున్నాడని స‌మాచారం.