ఐపీయల్ లో భాగం గా ఈ రోజు కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులు తలపడనున్నాయి. ఇందులో భాగం గా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ సీజన్లో తొలుత పరాజయాలు ఎదుర్కొని ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు కోల్‌కతా కూడా ఈ మ్యాచ్‌ను దక్కించుకొనేందుకు పూర్తిగా రెడీ అయింది. కోల్‌కతా తమ టీంలో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా పంజాబ్ జట్టులో మోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు అంకిత్ రాజ్‌పుత్‌కి చోటు కల్పించారు.
పంజాబ్ జట్టు లోని గేల్ ఫామ్ లోకి రావడం తో పంజాబ్ జట్టు బలం మరింత గా పెరిగింది. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ లల్లోనూ గేల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ రోజు కూడా పంజాబ్ జట్టు అతని పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.