//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పంజాబ్ లక్ష్యం 192

Category : sports

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకి ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ముజీద్ వేసిన రెండు ఓవర్‌లో ఓపెనర్ సునీల్ నరైన్(1) కరుణ్ నైర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో మరో ఓపెనర్ క్రిస్ లిన్ జట్టుకు అండగా నిలిచాడు. పంజాబ్ బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. 41 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సులు బాది 74 పరుగులు చేశాడు. లిన్‌కు రాబిన్ ఉతప్ప మంచి సహకారాన్ని అందించాడు.

అయితే రాబిన్ ఉతప్ప (34), నితీశ్ రాణా (3) కొన్ని బంతుల తేడాతోనే పెవిలియన్ చేరారు. అయినప్పటికీ లిన్ పట్టు వదలకుండా పరుగులు చేశాడు. అయితే టై వేసిన 16వ ఓవర్‌లో కీపర్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి లిన్ పెవిలియన్ చేరాడు. దీంతో జట్టు భారాన్ని కెప్టెన్ దినేష్ కార్తీక తనపై వేసుకున్నాడు. 28 బంతుల్లో 6 ఫోర్లు బాది 43 పరుగులు చేసి జట్టు స్కోర్‌లో కీలక పాత్ర పోషించాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో స్రాన్, టై 2, రహ్మన్, అశ్విన్ తలో వికెట్ తీశారు.

Related News