//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశంలోనే పెద్ద బ్యాంక్ కుంభ‌కోణం..!

Category : national

ఈ మద్య డబ్బు సంపాదన కోసం ఎదుటి వారిని నిలువునా మోసం చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. అవును ఆ మోడీ దాదాపు 11 వేల కోట్ల 400 రూపాయలకు టోపీ పెట్టేశాడు.

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి తెరలేపాడు.కాకపోతే ఆ మోడీకి ప్రధాని నరేంద్రమోడీకి సంబంధం లేదు లెండి.ఈయన ఓ వజ్రాల వ్యాపారి.ఆయన తెలివిగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ను నిలువునా ముంచేశాడు.

ఇప్పుడు దేశంలో ఇదే హాట్ టాపిక్.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ముంబయి శాఖలోఈ కుంభకోణం జరిగింది.ఏకంగా 11వేల 400కోట్ల రూపాయల కుంభకోణం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇంతకీ అసలేం జరిగింది.నిరావ్ మోదీ అనే వజ్రాల వ్యాపారి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయిలో ఉన్న అధికారులు,కొందరు ఖాతాదారులు కుమ్మక్కయ్యాడు.2011 నుంచి ఈ అక్రమాలకు పాల్పడ్డాడు.అంతేకాదు ఇతర బ్యాంకుల ద్వారా ఆ నిధులన్నీ విదేశాలకు తరలిపోయాయి.

పాత లావాదేవీల విశ్లేషిస్తే ఈ దారుణం బయటపడింది.ఈ కుంభకోణంపై దర్యాప్తు సంస్థలకు ఇప్పటికే సమాచారం ఇచ్చి 10మంది అధికారుల్ని సస్పెండ్‌ చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది.అక్రమ లావాదేవీలతో ఏమేర నష్టం జరిగిందో ఇంకా తెలియదని విచారణ తర్వాతే స్పష్టత వస్తుందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెబుతోంది. అక్రమాలకు పాల్పడిన ఆభరణాల సంస్థనిరావ్‌ మోదీకి చెందిందా కాదా అన్న అంశంపై బ్యాంకు క్లారిటీ ఇవ్వలేదు.

అసలే బ్యాంకులు మొండి బకాయిల సమస్యతో బాధపడుతున్నాయి.వేల కోట్ల రూపాయలు నష్టాల్లో మూలుగుతున్నాయి.అందుకే కేంద్ర ఆర్థిక శాఖ వెంటనే స్పందించింది.ఈ పీఎన్‌బీ ముంబయి శాఖలో అక్రమాల వ్యవహారం ఇంకా చేయి దాటిపోలేదని ప్రకటించింది.

అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది.ఇంత పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు దాదాపు 10శాతం నష్టపోయాయి.