//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పంజాబ్ నేషనల్ బ్యాంకుకి పంగనామం పెట్టిన మోడీ..!

Category : national

ఢిల్లీలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా పేరొందిన నిరావ్ మోదీ,గత ఏడాది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 280.7 కోట్ల రూపాయల రుణాన్ని ఎలాంటి పూచీకత్తు,నిర్ణీత పత్రాలు లేకుండా పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగులతో కలిసి చేసిన గోల్ మాల్ తెలిసిందే.ఈ విషయమై పాత లావాదేవీల విశ్లేషిస్తే పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈయన తెలివిగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ను నిలువునా ముంచేశాడు.

ఏకంగా 11వేల 400కోట్ల రూపాయల టోపీ పెట్టేశాడు.దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి తెరలేపాడు.ఇప్పుడు దేశంలో ఇదే హాట్ టాపిక్.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ముంబయి శాఖలోఈ కుంభకోణం జరిగింది.నిరావ్ మోదీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ స్థాయిలో ఉన్న అధికారులు,మరి కొందరు ఖాతాదారులతో కుమ్మక్కయ్యాడు.2011 నుంచి ఈ అక్రమాలకు పాల్పడ్డాడు.అంతేకాదు ఇతర బ్యాంకుల ద్వారా ఆ నిధులన్నీ విదేశాలకు తరలించేసాడు.

ఈ కుంభకోణంపై పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇప్పటికే 10మంది అధికారుల్ని సస్పెండ్‌ చేసినట్లు దర్యాప్తు సంస్థలకు సమాచారం తెలిపింది.అక్రమ లావాదేవీలతో ఏమేర నష్టం జరిగిందో ఇంకా తెలియదని విచారణ తర్వాతే స్పష్టత వస్తుందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెబుతోంది.అక్రమాలకు పాల్పడిన ఆభరణాల సంస్థ నిరావ్‌ మోదీకి చెందిందా కాదా అన్న అంశంపై బ్యాంకు క్లారిటీ ఇవ్వలేదు.

పారిశ్రామికవేత్తలతో పాటు,పలువురు ప్రముఖులు బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలను రుణాలుగా తీసుకున్నారు కానీ తిరిగి చెల్లించక మొండి బకాయిల సమస్యతో బ్యాంకులు బాధపడుతున్నాయి.వేల కోట్ల రూపాయలు నష్టాల్లో మూలుగుతున్నాయి.అందుకే కేంద్ర ఆర్థిక శాఖ వెంటనే స్పందించింది.

ఈ పీఎన్‌బీ ముంబయి శాఖలో అక్రమాల వ్యవహారం ఇంకా చేయి దాటిపోలేదని ప్రకటించింది.అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది.ఇంత పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు దాదాపు 10శాతం నష్టపోయాయి.