//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్యాంకు స్కాముల్లో సిఎం అల్లుడు.. 97.85కోట్లు .!

Category : national

దేశంలో రోజు రోజు కి పెరిగిపోతున్న బ్యాంకు స్కాములు. కోటానుకోట్లు కొల్లగొడుతున్న ప్రముఖులు. డబ్బంతా విదేశాలకు తరలించేస్తునారు. ఉన్నత స్థాయిలో ఉన్న వారే ఈ మోసాలకు పాల్పడటం దేశానికే అవమానకరం. మాల్యా, నిరవ్ మోడీ ఇలా ఒక్కొక్కళ్ళుగా బ్యాంకు స్కాముల్లో వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఈ నిందుతుల జాబితాలో పంజాబ్ ముఖ్యమంత్రి అల్లుడు కూడా చేరాడు.

శింభోలి షుగర్స్ బ్యాంకులకు 97.85 కోట్ల మేర మోసం చేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అల్లుడి పేరును సైతం నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. ఎఫ్ ఐఆర్ లో పంజాబ్ సీఎం అల్లుడు గురుపాల్ సింగ్ తోపాటు మరో 12 మంది పేర్లను పేర్కొంది.

పంజాబ్ ముఖ్యమంత్రి అల్లుడి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడంపై శిరోమణి అకాలీదళ్ నేత, కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ స్పందిస్తూ సీఎం కుటుంబం అంతా స్కాముల్లో ఉన్న వారే వారి నుంచి మీరేం ఆశిస్తారు, నల్ల దానం మొత్తం విదేశాలలో ఉన్నది. ఇది వారి కుటుంబానికి కొత్తేమి కాదు. కాంగ్రెస్ కు ఇది గతం నుంచి ఉన్న అలవాటే ఇందులో ఆశ్చర్య పడాల్సింది ఏమి లేదు అన్నారు.