//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అనూహ్యంగా ఐపిఎల్‌ ఫైనల్స్‌కు చేరిన పూణె

Category : sports

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పూణె తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. తొలి క్వాలిఫైయిర్స్‌ రేసులో ముంబయిని సొంతగడ్డపై ఓడించి సగర్వంగా స్మిత్‌ సేన టైటిల్‌ రేసులో నిలిచింది. రెండు సార్లు ఛాంపియన్‌షిప్‌ సాధించిన ముంబయిపై 20 పరు గుల తేడాతో స్మిత్‌ సేన ఘన విజయం సాధిం చింది.

దీంతో 21న ఫైనల్స్‌కు చేరే మరో జట్టు ఎవరనేది తేలాల్సి ఉంది. భారీ స్కోర్‌ చేయడంలో పూణె తడబడినా రహానే, తివారీ అర్ధ శతకాలు, ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌, బౌలర్లు సుందర్‌ 3/16, శార్థూల్‌ ఠాకూర్‌ 3/33తో ముంబయిని నింగి నుంచి నేలకు దించేశారు. పదో సీజన్‌లో వరుసగా రోహిత్‌ సేనపై పూనెకు ఇది మూడో విజయం కావడం గమనార్హం. 

గత సీజన్‌లో పేలవ ప్రదర్శనకు పూర్తి భిన్నంగా ఈసారి స్ఫూర్తిదాయక విజయాలు సొంతం చేసుకున్న పుణె తొలి ఫైనల్ బెర్తును దక్కించుకుని ఔరా అనిపించింది.

ఈ మ్యాచ్‌ ఓటమితో ముంబయి ఈ నెల 19న జరిగే రెండో క్వాలిఫైయిర్స్‌ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరడానికి అవకాశం ఉంటుంది.ముంబయి ఇండియన్స్‌ ఫాస్ట్‌బౌలర్లు అద్బుతమైన బౌలింగ్‌తో పూణెను కట్టి పడేశారు. ఎవరికి వారే అన్నట్లుగా డెడ్‌బాల్స్‌తో రైజింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పాలు చేశారు. 

టాస్‌ గెలిచిన ముంబయి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాట్‌పట్టిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 162/4 పరుగుల చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి 20 ఓవర్లలో 142/9 చేసి ఓడింది. బుమ్రా 16, మలింగ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 

ఈ మ్యాచ్‌ ఓటమితో ముంబయి ఈ నెల 19న జరిగే రెండో క్వాలిఫైయిర్స్‌ మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరడానికి అవకాశం ఉంటుంది.ముంబయి ఇండియన్స్‌ ఫాస్ట్‌బౌలర్లు అద్బుతమైన బౌలింగ్‌తో పూణెను కట్టి పడేశారు. ఎవరికి వారే అన్నట్లుగా డెడ్‌బాల్స్‌తో రైజింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పాలు చేశారు. 

మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కీలకమైన సమయంలో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. దీంతో పూణె ఓ మోస్తరు భారీ స్కోర్‌ సాధనకు తోడ్పాటు అందించాడు. 26 బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టిన ధోనీ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ఐపిఎల్‌లో ఇదే రెండో అత్యధిక స్కోర్‌ కావడం విశేషం.