//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుమ్మడికాయలో అద్భుత ఔషధాలున్నాయి. మీకు తెలుసా

Category : health editorial

గుమ్మడికాయలో అద్భుత ఔషధాలున్నాయి. మన దేశ సంప్రదాయ వంటకాల్లో దీనికి ప్రత్యేక స్ధానం ఉంది.. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా రకాల అనారోగ్య సమస్యలకు గుమ్మడి మందులా పనిచేస్తుంది.గుమ్మడి కాయను ఆహారపదార్ధాల్లో తీసుకోవడం వల్ల శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది. కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ సి సంవృద్ధిగా లభిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా గుమ్మడికాయ కూడా ఎంతో మంచిది. బీపీని కూడా నియంత్రిస్తుంది. పీచుపదార్ధం ఎక్కువగా ఉన్నందున కోలెస్ట్రాల్ తగ్గిస్తుంది.గుమ్మడి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. వాటిని ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో వేసుకుని తాగితే యూరినల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి.! తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుమ్మడి కాయతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. జ్యూస్ గానూ , సూప్ లాగా తాగవచ్చు.